వాషింగ్టన్ సుందర్’సినిమా టీజర్ విడుదల


ఘనంగా ‘వాషింగ్టన్ సుందర్’ సినిమా టీజర్ లాంచ్ 

ఎస్.ఎస్. మూవీ కార్పొరేషన్ (SS Movie Corporation) బ్యానర్‌పై సత్య వినుగొండ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘వాషింగ్టన్ సుందర్’. ఈ సినిమాలో శీతల్ భట్, అనూశ్రీ రాయ్ కథానాయికలుగా నటిస్తుండగా, ‘బలగం’ సంజయ్ (విలన్‌గా), ‘జాతిరత్నాలు’ ప్రేమ్ కుమార్, మురళీధర్ గౌడ్, సమ్మెట గాంధీ, నరేన్, నాగమహేష్, దేవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా, సోమవారం (నవంబర్ 23) హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా ‘వాషింగ్టన్ సుందర్’ టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరో, దర్శకుడు, నిర్మాత సత్య వినుగొండ మాట్లాడుతూ.. ‘‘సినిమా అంటే నాకు ఎంతో ప్యాషన్. నేను ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాను. మొదటి రెండు సినిమాల పేర్లు జనాలకు అంతగా తెలియకపోవచ్చు కానీ, ఈ మూడో సినిమా ‘వాషింగ్టన్ సుందర్’ మాత్రం ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది. నిర్మాతగా, దర్శకుడిగా, హీరోగా మూడు బాధ్యతలను ఒకేసారి మోయడం అంత సులభం కాదు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, రోజూ ఉదయం 4 గంటలకే నిద్రలేచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ టీమ్ అంతా ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి, అనుదీప్ కె.వి., ‘ వేణు ఉడుగుల, శివ నిర్వాణ, హరీష్ శంకర్ వంటి దర్శకులు నన్ను ఆశీర్వదించి ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే గుంటూరుకు చెందిన నన్ను జోగిపేటలో సొంత మనిషిలా ఆదరించి సహకరించిన ప్రేమ్ కుమార్, అంజన్న, సంతోష్ అన్నలకు ప్రత్యేక కృతజ్ఞతలు. సంగీత దర్శకుడు నందన్ రాజ్ బొబ్బిలి నాకు సొంత అన్నలా అండగా నిలబడి, తన మ్యూజిక్‌తో సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. మా అమ్మ కోరిక మేరకే ‘ఎస్.ఎస్. మూవీ కార్పొరేషన్’ బ్యానర్ స్థాపించాను. కసితో పనిచేశాను, ఈ సినిమాతో తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ఇప్పుడు విడుదలైన టీజర్ కేవలం శాంపిల్ మాత్రమే. వచ్చే నెలలో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాం. తెలుగు ప్రేక్షకులు, మీడియా మిత్రులు నన్ను, మా ‘వాషింగ్టన్ సుందర్’ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.

ఇంకా చిత్రయూనిట్ సభ్యులు మాట్లాడుతూ.. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరారు.

సత్య వినుగొండ, అనూశ్రీ రాయ్, శీతల్ భట్, ‘బలగం’ సంజయ్, ‘జాతిరత్నాలు’ ప్రేమ్ కుమార్, మురళీధర్ గౌడ్, సమ్మెట గాంధీ, నరేన్, నాగమహేష్,  ఛత్రపతి శేఖర్, రాకెట్ రాఘవ,దేవ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
బ్యానర్: ఎస్.ఎస్. మూవీ కార్పొరేషన్
సంగీతం: నందన్ రాజ్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: మధు బసిరెడ్డి
ఎడిటర్: శ్రీ మేనగ
పీఆర్వో: బి. వీరబాబు
సహ నిర్మాతలు: బి. ప్రేమ్ కుమార్, అంజయ్య దన్నారం, జీవన్ రెడ్డి పోతులూరి
కథ, దర్శకత్వం, నిర్మాత: సత్య వినుగొండ